గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని అందరూ భావించారు. అయితే బాలకృష్ణ మాత్రం కూడా ప్రచారం చేసే విషయంలో ముందడుగు వేయడం లేదు. ఆయన చివరి రెండు రోజులు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత కూడా రావడంలేదు. త్వరలోనే ఆయన ప్రచారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు తో పాటుగా లోకేష్ తో కూడా చర్చించారని అంతేకాకుండా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపారని సమాచారం.

అయితే ప్రచారానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. త్వరలోనే ఆయన ప్రచారం చేసే అవకాశాలకు సంబంధించి స్పష్టత రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలు మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి ఆయన సినిమా షూటింగులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు బిజీగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో ఆయన ఎంత వరకు ముందు నడుస్తారు ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే నేతలు ఉన్నారు.

కాబట్టి బాలకృష్ణ ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఈ ప్రచారం విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఆయన ఎలాంటి ముందడుగు వేస్తారు అనేది చూడాలి. అయితే ఇప్పుడు బాలకృష్ణ ప్రచారం చేస్తే బాగుంటుంది అని తెలంగాణా తెలుగుదేశం నేతలు  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. ఇక నారా లోకేష్ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారు అని ఆలోచన ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: