గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లోని ప్రముఖ పార్టీలు పోటీ పడుతూ ప్రచారం చేస్తున్నారు. నువ్వా నేనా అంటూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల లో గెలుపు ఎవరిది అనేది మాత్రం చర్చ నియాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోడ్ షో లు నిర్వహిస్తూ నియోజక వర్గం లోని ప్రజలను ఓట్లు వేసేలా చూస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలిచి వారికి కావలసిన మద్దతును అందిస్తున్నారు. ఇకపోతే అధికార పార్టీ నేతలు కార్య కర్తలు ఈ విషయంలో ముందున్నారు.

 

పలు ప్రాంతాల్లో నేతలకు ప్రజల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే వెనకడుగు వేయకుండా ముందుకు వస్తున్నారు. ఏరియాల్లో పలు రోడ్ షో లను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజలకు ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలిచడం, వారి పురోగతులు ఎలా ఉన్నాయో తెలుపుతూ వస్తున్నారు. బీజేపి మాటలు నమ్మవద్దు.. ఒక్కసారి ఎన్నికల్లో గెలిచింది. అలాంటిది వాళ్ళు ఒట్టిమాటలు మాత్రమే చెబుతున్నారు. ప్రజలు అలాంటి వాళ్ళను మాత్రం సపోర్ట్ చేయకండి. టీఆరెఎస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తుంది.



ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేస్తుంది. విద్యార్థులకు జాబ్ మేళా ను అందుబాటు లోకి తీసుకువచ్చింది.. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ దాస్ గౌడ్‌కు మద్దతు గా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏర్పాటు చేసిన మహిళా సదస్సుకు ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పేద ప్రజలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్ల ద్వారా ప్రతి ఇంటికి పెద్దన్న పాత్ర కేసీఆర్ పోషిస్తున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు కేటాయించారని గుర్తు చేశారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: