పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆరేళ్ళు అవుతున్న ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థాయిలో ఉన్నలు కనిపిస్తుంది. 2014 లో జనసేన పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతిచ్చి ఆ తర్వాత సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా పాల్గొని ఒక్క సీటు ను దక్కించుకుని ఘోర పరాభవం పాలైన పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తారనుకున్నారు జన సైనికులు. అయన సినిమా అభిమానులు కూడా పవన్ సినిమాలు మానేస్తున్నానని చెప్పడంతో అయన ఇక రాజకీయాలకే అంకితం అని అనుకున్నారు..

కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమా బాట పట్టడంతో ఓవైపు ఆనందమేసినా మరోవైపు వారికి గొంతులో అరటిపండు అడ్డుకున్నట్లు అయ్యింది.. పవన్ మళ్ళీ సినిమాలు చేయడం వారికి ససేమీరా నచ్చట్లేడు ఎందుకంటే నిత్యం రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షంలో గట్టి గళాన్ని వినిపిస్తూ అధికారపార్టీ ను విమర్శించి ప్రజల్లో ఉనికిని చాటుకునేది పోయి మళ్ళీ సినిమా లు చేస్తే రాజకీయంగా పవన్ కి ఒరిగేదేంటి అని వారి వాదన..

అందుకు తోడు బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకుని మరింత పెద్ద తప్పుశారని వాదనలు వినిపిస్తున్నాయి.. బీజేపీ కూడా జనసేన ను  తొక్కేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది. జనసేన తన బలాన్ని గుర్తించిందో లేదో కానీ.. బీజేపీ పంచన చేరడానికి నిర్ణయించుకుంది. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టత లేదు కానీ.. అప్పట్నుండి .. జనసేన బయటకు రాకుండా చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేసినా.. కలిసే చేయాలన్న నిబందన కారణం చూపి.. బీజేపీ పవన్ ను సైలెంట్ చేసింది. పవన్ కూడా ఈ ట్రాప్‌లో పడిపోయారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్ని లైట్ తీసుకున్నారు.మిత్రపక్ష పార్టీల్ని మెల్లగా స్వాహా చేయడం.. బీజేపీ శైలి. పెద్ద పెద్ద పార్టీల్నే ఆ పార్టీ కబ్జా చేసేసింది. చివరికి నిర్వీర్యం చేసింది. జనసేనకు ఆ గతి పట్టించడం పెద్ద విషయం కాదు. ఆ దిశగానే సాగుతోంది. కానీ పవన్ కల్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: