బీజేపీ పార్టీ గ్రేటర్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఆ పార్టీ గెలవడానికి అవలంభించే విధానాలను బట్టి తెలుస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలోబీజేపీ కి ప్రజలనుంచి మద్దతు లభిస్తుంది.. ఈ మద్దతు ను తమకు అవకాశం గా మలుచుకుని గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం, ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలను దింపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి చరిష్మా ఉన్న నాయకులను అస్త్రాలుగా సంధించనుంది. జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న నేతలను గ్రేటర్ వార్ లోకి దిండచం ద్వారా గెలుపు తీరాలకు చేరుకోవాలనుకుంటోంది.  

ఇప్పటికే  బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ప్రచారంలో ఉన్నారు. ఆయనకు తోడుగా స్మృతి ఇరానీ వంటి వారు రంగంలో దిగుతున్నారు. ప్రకాష్ జవదేకర్ కూడా జీహెచ్ఎంసీ పనిలో పడ్డారు. త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా కూడా రంగంలో దిగబోతున్నారు.  ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ పై ఈ పార్టీ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి గోల్కొండ కోటపై జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఆ కల నిజం కావాలంటే... ఇప్పుడు గ్రేటర్ లో సత్తాచాటాల్సిన అనివార్యత బీజేపీ ముందుంది. అందుకే...  జీహెచ్ఎంసీ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది బీజేపీ.

మొత్తానికి బీజేపీ పార్టీ సీఎం కుర్చీకి కేసీఆర్ తో పోటీ కి దిగారని స్పష్టంగా తెలుస్తుంది. అందుకు తగ్గట్లే తమ వద్ద ఉన్న ప్రచార అష్ట్రమైన ఆర్.ఎస్ ఎస్ ను వాడుకోనుంది.. ఎంఐఎంతో టీఆర్ఎస్ జట్టుకట్టిందని, టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎం వశమవుతుందని పదే పదే మాట్లాడుతోంది.గ్రేటర్ లో యువ ఓటర్లను తమవైపు మలుపుకునేందుకు ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యను ప్రచారంలోకి దించారు రాష్ట్ర బీజేపీ నేతలు. పిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఈ యువ ఎంపీ గ్రేటర్ ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.అధికారాన్ని దక్కించుకోవడానికి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్న రాజకీయపార్టీల తీరు చూస్తుంటే గ్రేటర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: