గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ పార్టీ చాలా హోప్స్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించి మరింత బలపడాలని చూస్తుంది. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..

ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో  తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగా వారికి దుబ్బాక ఉప ఎన్నికలు ద్వారం తెరిచినట్టయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ ఎలక్షన్స్ లో గెలుపే  వీరికి
టోర్నమెంట్ లీగ్ దశలో గెలిచినట్లయింది. దీంతో గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నట్లు తెలుస్తుంది.

గ్రేటర్ ఎన్నికలను బీజేపీ దాదాపు సాధారణ ఎన్నికల మాదిరిగా భావిస్తోంది. ఇప్పటికే కీలక నాయకత్వం అంతా బల్దియా మీద కేంద్రీకరించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ప్రచారంలో ఉన్నారు. ఆయనకు తోడుగా స్మృతి ఇరానీ వంటి వారు రంగంలో దిగుతున్నారు. ప్రకాష్ జవదేకర్ కూడా జీహెచ్ఎంసీ పనిలో పడ్డారు. త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా కూడా రంగంలో దిగబోతున్నారు. తద్వారా తెలంగాణాలో దాదాపు మూడో వంతు నియోజకవర్గాలను ప్రభావితం చేసే హైదరాబాద్ ని అందిపుచ్చుకునే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో తమకు ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: