ఏపీలో ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీ పార్టీ తెలంగాణ గ్రేటర్ ఎలక్షన్స్ లో పాల్గొన పెద్ద సాహసమే చేస్తుంది.. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కి చేదు అనుభవం ఎదురైనా నగరంలో తమ పార్టీ కి మంచి బలం ఉందని నమ్ముతుంది.. అయితే చంద్రబాబు అంచనాలను పార్టీ ఏమాత్రం అందుకుంటుందో తెలీదు కానీ టీడీపీ పరువు హైదరాబాద్ సాక్షిగా మరొకసారిపోవడం ఖాయంగా అనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల కోసం అధికార పార్టీ టీ ఆర్ ఎస్ సహా కాంగ్రెస్ బీజేపీ పార్టీ హోరా హోరీగా తలపడుతున్నాయి.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా బీజేపీ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ లో ప్రచారం చేస్తుంది.

ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ పార్టీ గ్రేటర్ లోనూ గెలుపొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దాంతో అన్ని పార్టీ లు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు, స్టార్ క్యాంపెయిన‌ర్స్ రోడ్ షోలు, పాద‌యాత్ర‌ల‌తో దూసుకెళ్తుంటే  తెలుగుదేశం లో విచిత్ర ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  టీడీపీ తరపున నిలబడే అభ్యర్థులు తప్పా ఎవరు ప్రచారం లో కనిపించడం లేదు. నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినీ అప్పుడప్పుడు కనిపిస్తున్న ఆమె ప్రచారం ఎంతవరకు పనికొస్తుందో చెప్పలేం..

 ప్ర‌చారానికి ఇక ఐదు రోజులే గ‌డువు ఉంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ సహా బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్‌ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తూనే స్మార్ట్‌ఫోన్‌లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు. టీడీపీ నుంచి మాత్రం ఎలాంటి జోరు కనిపించడంలేదు.. ఎదో ఎన్నికల్లో పోటీ చేయాలి కదా అన్నట్లు చేస్తున్నారు. .మరి ప్ర‌చారానికి ఇక ఐదు రోజులే గ‌డువు ఉండ‌డంతో ఎవ‌రెవ‌రు రంగంలోకి దిగుతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: