గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై బీజేపీ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ప్రచారం చేసే విషయంలో ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. కొన్ని కొన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ కిఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అని సమాచారం. ప్రధానంగా చిరంజీవి టిఆర్ఎస్ పార్టీతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేవిధంగా మంత్రి కేటీఆర్ తనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయొద్దు అని సూచన చేస్తున్నట్లుగా సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు.

కాకపోతే బీజేపీ నేతలకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెరాసను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అంటే కొంత మంది నేతల సహాయ సహకారాలు అనేవి ఆ పార్టీకి చాలా అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను కూడా హైదరాబాదులో వాడుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కు ప్రచారం చేయమని స్వాగతం పలికే అవకాశం ఉందని అయితే చివరి రెండు రోజులు ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: