భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు ప్రచారం చేసే నేతల విషయంలో కాస్త ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఉంది. ముఖ్యంగా జాతీయ స్థాయి నేతలను ప్రచారానికి దింపే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది కీలక నేతలు ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు హైదరాబాదులో ప్రచారం చేసే కొంత మంది బీజేపీ నేతల విషయంలో కాస్త బిజెపి ఇబ్బంది పడుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతున్నాయి.

కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేయవద్దు అని బీజేపీ అధిష్టానం కొంతమందికి సూచనలు చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం లో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో కూడా ఒక రకమైన భయం అనేది వ్యక్తమైంది. రాజకీయంగా ఇప్పుడు బలపడాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడాలి వివాదాలు సృష్టించే విధంగా మాట్లాడితే అక్కడ ఎక్కువగా ఇబ్బందులు పడతామని... వ్యతిరేకంగా అవకాశాలు మారే విధంగా ఉన్నాయి అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.

హైదరాబాదులో ఉన్న పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. దేశంలో ఏ ప్రాంతంలో కూడా ముస్లింలు హిందువులు కలిసిపోయి ఉండే అవకాశం లేదు. ముస్లిములు తో కలిసి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇతర మతాలతో కూడా కలిసి ఇక్కడ హైదరాబాదులో వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే హిందువులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంది అనే భావన బీజేపీ అధిష్టానం కొంతమంది నేతలు వద్ద వ్యక్తం చేస్తుంది. కేవలం అభివృద్ధి గురించి మాత్రమే ప్రస్తావించాలి అని సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: