గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి నాయకులను ప్రచారానికి భారతీయ జనతా పార్టీ వాడుతోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చాలామంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో భారతీయ  జనతా పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి చాలా వరకు కూడా మైనస్ గా మారుతున్నాయి. ప్రధానంగా కొంతమంది నేతలు పదేపదే కొంతమందిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు.

దీనివలన పార్టీ కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ ఇప్పుడు బలోపేతం కావాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అనవసరంగా పార్టీ ఇబ్బంది పడుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని కాబట్టి ప్రజల్లో భయం అనేది కల్పిస్తే అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కోవడం అనేది కేవలం అభివృద్ధి ద్వారానే ఎదుర్కోవాలని ఆ పార్టీ కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ముఖ్యంగా తెలంగాణలో అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ కొంతమంది పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బీజేపీ నేతలు కాస్త నోటి దురుసు వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. దీని వల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుందని లాభపడేది ఏమీ ఉండదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: