గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆహర్నిశలు కృషి  చేస్తున్నారని నగరం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఆర్‌కేపురం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి మురుకుంట్ల విజయభారతి అన్నారు. బుధవారం ఆర్‌కేపురం డివిజన్ ‌లోని చిత్రలేవుట్ ‌కాలనీ, ఎన్టీఆర్ ‌నగర్, వాస్తుకాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదం చేస్తాయని తెలిపారు. ఆర్ ‌కేపురం డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ గెలిపించాలని కోరారు. ఆర్‌కేపురం డివిజన్‌ విద్యాశాఖ మంత్రి సహకారంతో డివిజన్‌ అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ నగరం రాకెట్‌ స్పీడుతో దుసుకుపోతుందని ఆమె అన్నారు.

ఇక గ్రేటర్‌ లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో నగరాభివృద్ధికి వేసిన పునాదులు పార్టీకి విజయసోపానాలు అయ్యాయి అని తెలిపారు. విజయభారతి ప్రచారానికి ప్రజలను నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో  మహేశ్వరం నియోజకవర్గ మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పటేల్‌ సునీత రెడ్డి , డివిజన్‌ మహిళా అధ్యక్షురాలు ఛామల శైలజ, మనోరమ, పుష్పలత, మాదవి, సైదా, అనురాధ, కౌసల్య, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని డివిజన్‌ పరిధిలోని అన్ని కాలనీలో టీఆర్‌ఎస్‌ నాయకులు ముమ్మురంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: