సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోటోలు దిగటానికి  బాగా డిమాండ్ వచ్చింది అనే విషయం తెలిసిందే. కొంతమంది అయితే ఎంతో చిత్రవిచిత్రంగా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా కేవలం లైకుల కోసం మాత్రమే. చిత్రవిచిత్రంగా ఫోటోలు దిగుతారు కానీ తర్వాత మాత్రం సాధారణంగానే ఉంటారు ప్రస్తుతం చైనా ఆర్మీ లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ఆర్మీ కూడా ఇటీవల ఇదే తరహా ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇంతకీ చైనా ఆర్మీ ఏం చేసింది  అని అంటారా  సాధరణంగా అయితే అన్ని దేశాల ఆర్మీ లు  ఒకసారి సైన్యం లోకి వచ్చిన తర్వాత అన్ని కష్టాలను ఓర్చుకుని  సైనికుడుగా రాటుదేలుతుంటారు  కానీ చైనా ఆర్మీలో మాత్రం అలా ఉండదు.. చైనా లోని ప్రతి ఒక్కరు కూడా సైన్యం లోకి రావాలి అని నిబంధనల నేపథ్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్తవారు రావడం పాతవారు సైన్యం నుంచి బయటికి వెళ్లడం జరుగుతుంది. చైనా సైన్యానికి సైన్యం లోకి రావడం విదేశాలకు టూర్ కి వెళ్ళినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే అక్కడ చిత్రవిచిత్రంగా ఫోటోలు దిగుతుంటారు.



 ఇటీవలే ఇలాగే ఫోటోలు దిగగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవలే చైనాలోని సైనికులు ఏకంగా పొడవాటి కర్రలకు చివరణ కొడవళ్లు  పట్టుకుని సరిహద్దుల్లో పహారా కాస్తున్న ట్లుగా వరుసగా నిలబడి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆర్మీ లోకి వచ్చిన తర్వాత బాధ్యత వ్యవహరించకుండా ఇలాంటివి చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: