పాకిస్తాన్ లో రోజు రోజుకు భారత్ నినాదాలు ఎక్కువ అవుతున్నాయి  అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమ బాట పడుతున్నారు అదే సమయంలో ఉద్యమాలు కూడా రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కి కొత్త తలనొప్పిలు  వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దేశంగా ఉన్న బెలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించు కుని పాకిస్తాన్ లో ఒక భాగంగా మలుచుకుంది  అన్న విషయం తెలిసిందే.


 పాకిస్తాన్లో బెలూచిస్థాన్ ప్రాంతాన్ని ఒక భాగంగా చేసుకున్న తర్వాత కూడా పాకిస్తాన్ తీరులో మార్పు రాలేదు. ఏకంగా దేశ సార్వభౌమత్వాన్ని చైనా దగ్గర తాకట్టు పెట్టి దేశ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి.. చైనా  సైనికులు పాకిస్తాన్లోనే దారుణాలకు పాల్పడుతున్నప్పటికి కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తు దారుణంగా ప్రవర్తిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి బెలూచిస్థాన్ లో  భారత్ నినాదం వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఏకంగా మోడీ ఫ్లెక్సీలు కూడా బెలూచిస్థాన్ లో కనిపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



 ఇప్పటికే ఉద్యమబాట పట్టిన బెలూచిస్థాన్ ప్రజలు చేస్తున్న నినాదాలు ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. సాధారణంగా నినాదాలు ఉద్యమానికి సరికొత్త ఊపిరి పోస్తూ ఉండడమే కాదు ఉద్యమ కాంక్ష రగిలిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అలాంటి తరహా నినాదాలు ప్రస్తుతం బలూచిస్తాన్ లో వినిపిస్తున్నాయి. బెలూచిస్తాన్ లో చేస్తున్న నినాదాలు తెలుగులో అనువదిస్తే.. పాకిస్తాన్ను వదిలేయండి.. భారత్తో కలిసి ప్రయాణిద్దాం.. విచ్చిన్నకర రాజ్యాలు మాకొద్దు.. అభివృద్ధి చెందిన దేశాలతో నడుస్తాం.. తాకట్టు పెట్టే నేతలు మాకొద్దు.. ఆత్మగౌరవంతో నిలిపేటువంటి భారత్ నాకు కావాలి... ఇలాంటి నినాదాలు ప్రస్తుతం బెలూచిస్థాన్ లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: