కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణం లో కేంద్రం రాష్ట్రాలని మరియు ప్రజలను అప్రమత్తం చేసింది .. .. ఈ మేరకు ఈరోజు సాయంత్రం కేంద్రం కరోనా కట్టడి కోసం  మార్గదర్శకాలని జారీ చేసింది .. కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాపిస్తున్న  నేపథ్యం లో మార్గదర్శకాలని కఠినంగా అమలు చేయాలనీ ఆదేశించింది .. నిబంధనలను అతిక్రమించిన వారిపై  చర్యలు  తీసుకోవాలని సూచించింది .. బయటి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ..మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించాలని తెలిపింది ..

ఈ నెల 30  కి కేంద్రం విధించిన నిబంధనలు పూర్తి కావడం తో ..కేంద్ర హోం శాఖ ఈరోజు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ..ఈ నిబంధనలు డిసెంబర్ 1  నుండి 31  వ తేదీ వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది .. కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను గమనిస్తే

కంటైన్‌మెంట్ జోన్లలో లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం తెలిపింది ..మతపరమైన కార్యక్రమాలు ,50  శాతం సీట్లతో థియేటర్స్ ని ఓపెన్ చేసుకోవచ్చని కరోనా పరిస్థితులను బట్టి వాటిని మూసివేసే అధికారం రాష్ట్రాలకి ఉంటుందని తెలిపింది .. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో రాత్రి పూట కర్ఫ్యూ ని విధించే నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది ..

కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర పనులకి మాత్రమే ప్రజలు బయటికి వెళ్లాలని ,పోలీసులు మరియు జిల్లా కలెక్టర్ ఆ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరచాలని ఈ  బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని తెలిపింది .. కరోనా పాజిటివ్ గా నిర్దారణ  అయినా వ్యక్తులు విడిగా 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్ల సలహాలు మరియు సూచనలు పాటించాలి అని కేంద్రం తెలిపింది .. స్విమ్మింగ్ పూల్స్ మరియు ఎగ్జిబిషన్ హాళ్ల పై నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: