ఉప్పల్ : గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాలలో వేగం పెంచుతున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఢీ అంటే ఢీ అంటూ గెలుపు కోసం పోరాడుతున్నాయి. ఈ మేరకు ప్రచారాలలో కారు జోరుమీద ఉందని అని చెప్పవచ్చు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఈసీఐఎల్ చౌరస్తాలో పర్యటించిన కేటీఆర్ గారు మాట్లాడుతూ..

మోదీ ఇచ్చిన హామీ ప్రకారం 15 లక్షల రూపాయలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండి.. రాని వారు మాకు ఓటు వేయండి అంటూ చమత్కారంతో ప్రసంగించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కొందరు పి.వి నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధులను కూల్చాలన్న వాళ్లు పిచ్చోళ్లనే చెప్పుకోవచ్చు అని ఎంఐఎం, బిజెపి  నేతలపై  ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుండి ఇ వచ్చేవారు టూరిస్టుల లాంటి వారు అని ఢిల్లీ నుంచి వస్తున్నా కేంద్ర మంత్రులకి హైదరాబాద్ స్వాగతం పలుకుతుందని ఎద్దేవా చేశారు.

కానీ వచ్చేటప్పుడు వట్టిచేతులతో రాకుండా నగర ప్రజలకు వరద సహాయం కింద 1350 కోట్లు తీసుకురావాలని కోరుకుంటున్న అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో కేటీఆర్ పర్యటించారు . అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తోన్న కార్పొరేటర్ అభ్యర్థులు కాప్రా నుంచి స్వర్ణరాజు, ఏఎస్ రావ్ నగర్ నుంచి పావని మణిపాల్ రెడ్డి, చర్లపల్లి నుంచి పోటీచేస్తున్న బొంతు శ్రీదేవి లకు తమ అమూల్యమైన ఓట్లు వేసి టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కేటీఆర్ స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: