గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ లోని ప్రముఖ పార్టీలు కూడా ఎన్నికలను గెలవాలనే కుతూహలంతో ముందుకు సాగుతున్నారు.. ఒక్కో పార్టీ ఒక్కో రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే టీఆరెఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఒక్క గెలుపుకు బీజేపి కోతలు కోస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన , కేసీఆర్ చేసిన విధంగా చేయాలంటే తరాలు సరిపోవు అంటూ ఎవరికీ వాళ్ళే గట్టి పోటీని ఇస్తున్నారు. ముఖ్యంగా టీఆరెఎస్ పార్టీ తరపు నుంచి మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎంపి కవిత పోటీలో ఉన్న నేతలను కార్యకర్తలను ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.. 



ఈ ఎన్నికలు ప్రచారం ఉద్రిక్తంగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల్లో తగు భద్రత చర్యలను తీసుకుంటున్నారు.. ప్రచారంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్‌, రాంబాగ్‌, సులేమాన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, గగన్‌పహాడ్‌ తదితర సమస్యాత్మక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పోలింగ్ బూతుల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై పోలీసులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. 



తర్వాత సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.. ఆయా ప్రాంతాల లోని రౌడీషీటర్లపై నిఘా పెంచడంతో పాటు అనిమానితులుగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ కౌంటింగ్‌ల వద్ద బందోబస్తులను పెంచామన్నారు. కార్యక్రమంలో డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ ఎన్‌ఎం విజయ్‌కుమార్‌, ఏడీసీపీ మాణిక్‌రాజ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: