దుబ్బాక ఎన్నికలలో బీజేపీ ఘన విజయం పొందింది. అదే జోరుతో గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తుంది.   ఉత్తరాది పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది. బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగా వారికి దుబ్బాక ఉప ఎన్నికలు ద్వారం తెరిచినట్టయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో  ఆర్‌కేపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి బరిలోకి దిగారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డివిజన్‌లో మరోసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి రాధా ధీరజ్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్‌కేపురం డివిజన్‌లో యాదవ్‌నగర్, అల్కాపురికాలనీలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధా ధీరజ్‌రెడ్డి మాట్లాడుతూ   ఎంఐఎంను అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎంతో అనైతిక పోత్తుపెట్టుకుని గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలే తగిన బుద్ది చెబుతారని తెలిపారు. గ్రేటర్‌పై కాషాయం జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ పార్టీ ముందు ఉంటుదని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ప్ర«ధాన మంత్రి నరేంద్రమోడి నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఆర్‌కేపురం డివిజన్‌ నుంచి మరోసారి కార్పొరేటర్‌ అవకాశం కల్పించాలని కోరారు. ప్రజా సమçస్యలు పరిష్కరించడంలో బీజేపీ పార్టీ ముందు ఉంటుదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిట్ట ఉపేందర్‌రెడ్డి, రాములుయాదవ్, సంతోష్, కరుణ తదతరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: