పురానాపూల్‌ డివిజన్‌లో మజ్లిస్‌ పార్టీని ఓడించి.. తానే గెలుస్తానని పురానాపూల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెండ్యాల లక్ష్మన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సిప్లీగంజ్‌ తదితర బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేసి వేసి గెలిపించమని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. పేదల కోసం పని చేస్తున్న తమ పార్టీని గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అధికార పార్టీ కృషి చేస్తోందని.. పార్టీ అభివృద్ది కార్యక్రమాలే తన విజయానికి దోహాద పడుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ ఎన్నికల పరిశీలకుడు బి.రంగారెడ్డి, నాయకులు రవీశ్వర్, ప్రణయ్‌ రాఘవేందర్, జితేందర్ తదితరులున్నారు.

పురానాపూల్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అహ్మద్‌ అస్లాం ఉల్లా షరీఫ్‌ పురానాపూల్‌ డివిజన్‌లో బుధవారం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని అన్ని బస్తీల్లో మహిళా కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చే హామీలను నమ్మకుండా ప్రజలు మంచి పాలనను అందించే నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశ భవిష్యత్ ను తిరగరాసే శక్తి యువతకు ఉందన్నారు. యువత రాజకీయాల్లో రాణించాలని ఆయన కోరారు.

పురానాపూల్‌ డివిజన్‌లోని అన్ని బస్తీల్లో ఆశించిన మేరకు అభివృద్ది సాధించామని డివిజన్‌ మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్‌ అన్నారు. బుధవారం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఈ ఎన్నికల్లో తననే గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురానాపూల్‌లో అభివృద్ధి కోసం తమ పార్టీ దశాబ్దాలుగా కృషి చేస్తోందన్నారు. కానీ, పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నామన్నారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: