కాంగ్రెస్‌ గెలుపుతోనే మూసారంబాగ్‌ ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మీశ్రీనివాస్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా సదాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజల కష్టాలను పట్టించుకోవడం టీఆర్‌ఎస్‌ విఫలమైందని విమర్శించారు. బస్తీలు, కాలనీలు కాంగ్రెస్‌ పార్టీకి బాసటగా నిలుస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌లో పేదలకు చేయూతను అందించి వారిని ఆదుకున్నానని, ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ పట్ల విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనను మరవొద్దని, అన్ని మతాల కలయికే కాంగ్రెస్ అన్నారు.

టీఆర్ఎస్ హామీలు, మాటలు నమ్మి మోసపోవద్దని, ఈ సారి టీఆర్ఎస్ గెలిస్తే.. బంగారు తెలంగాణ కాస్త.. అప్పుల తెలంగాణగా మారుతుందన్నారు. మత రాజకీయాలు చేస్తూ కొందరూ.. సొంతంటి నాయకులే రాష్ట్రాన్ని పాలించేవాళ్లు మరికొందరు తయారయ్యారని, ఈ సమయంలో పార్టీ అధికార బాధ్యతలు వాళ్ల చేతుల్లో పెట్టడం కరెక్ట్ కాదన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి సదాలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడు లింగాల శ్రీనివాస్‌గౌడ్‌ తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌ చేరిపోయారు. పార్టీ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్‌ గౌడ్ పార్టీ కండువాను కప్పి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ బలాన్ని చూసి అన్ని రాజకీయపార్టీలు భయపడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలే అధికార పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ శ్రీనివాస్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిరెడ్డి, గ్రేటర్‌ ప్రధాన కార్యదర్శి బోనగిరి చంద్రశేఖర్, డివిజన్‌ అధ్యక్షుడు గొట్టిపర్తి శ్రీనివాస్‌గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సోహేల్, మహేష్, సాయిరామ్‌, రాంబాబు, గిరి, లక్ష్మణ్ తదితరులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: