జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల సమరంతో ప్రచారం ఊపందుకున్నాయి.అన్నీ పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి.రోడ్ షో లతో,ప్రచారలతో, నేతల ప్రసంగాలతో నగర వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

 ఎన్నికలకు దగ్గర పడే కొద్ది ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం భారీగా సరఫరా అయ్యే అవకాశం వుండడంతో ఈ నెల 29 సాయంత్రం 6 గంటల నుండి డిసెంబరు 1 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.రాజకీయ పార్టీలు మందు బాబులకు మద్యాన్ని ఎరగా వేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పార్థసారధి తెలిపాడు.

హెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా, నిల్వలు.. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: