ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనను విరమించుకున్నారు.. ఈరోజు ఆయన రెండు పెళ్లిళ్లకు హాజరు కావలసి ఉంది.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు.. బుధవారం రాత్రి జరిగే రెండు వివాహాలకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది. ఇందుకు గాను బుధవారం సాయంత్రం బయల్దేరి.. తిరిగి రాత్రి 9.30కు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకునేలా షెడ్యూల్ వేశారు. కానీ, చివరి నిమిషం లో సీఎం జగన్ తన హైదరాబాద్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు.



సీఎం జగన్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సీఎం జగన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఓ పారిశ్రామికవేత్త కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. తర్వాత సీఎం జగన్ తన సొంత దినపత్రిక సంపాదకుడి ఇంట జరిగే మరో వివాహానికి హాజరైన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతం లో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ-గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లేలా ప్లాన్ చేసారు.. కానీ ప్రక్రియలో చిన్న మార్పులు రావడం తో మొత్తానికి తన ఆలోచనను మానికున్నాడు..



అందుకు ముఖ్య కారణం, బంగళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. దూసుకు వస్తున్న నివర్ తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించక పోవడంతో తన హైదరాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు జగన్ వెల్లడించారు.. వివాహానికి హాజరు కాలేననీ వారికి ఫోన్ లోనే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నివార్ తుఫాన్ ముంచుకొస్తుంది.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో సీఎం జగన్ పలు కార్యక్రమాలను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: