గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా తెరాస నేతలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నలుగురు రాష్ట్ర మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రి హరీష్ రావు ప్రచారం చేసే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఆయన కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోరుతున్నా ఆయన మాత్రం ప్రచారానికి చాలా వరకు దూరంగా ఉంటున్నారు. ఒక పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా ఆయన ఎక్కడా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారం చేయాలని ఆయనకు సూచించిన సరే ఆయన మాత్రం ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు దీని వలన పార్టీ నష్టపోతుందని కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు కి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా క్రేజ్ ఉందని కాబట్టి ఆయన ప్రచారం చేస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అయితే హరీష్ రావుకి తెరాస అధిష్టాన నేతలు ఫోన్ చేశారని మరికొంత మంది మంత్రులు కూడా ఆయనకు ఫోన్ చేసి ప్రచారం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు.

మరి మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం హైదరాబాదులో ప్రచారం చేసే విషయంలో మంత్రి హరీష్ రావు అలాగే కొంతమంది బాగా మాట్లాడే నేతలు ప్రచారం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్ ఎన్నికలు త్వరలోనే ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండు రోజుల్లో ప్రచారానికి రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: