గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ప్రచారం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం తమ తమ నియోజకవర్గ పరిధిలో కూడా చాలామంది ప్రచారం చేయలేకపోతున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చిన రోజే చాలా వరకు కూడా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.

కేటీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలో మాత్రమే బయటకు రావడంతో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదేవిధంగా పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు అందరూ కూడా హైదరాబాదులో ప్రచారం చేస్తున్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రచారంలోకి రావడం లేదో వారందరికీ కూడా ఇప్పుడు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు గురించి సీఎం కేసీఆర్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆయన అభ్యర్థులకు ఫోన్లు చేసి కొంత మంది గురించి అడుగుతున్నారని సమాచారం. ఎవరైతే ప్రచారం చేయటం లేదో వారందరి గురించి తమకు సమాచారం పంపాలని ఎమ్మెల్యేలు ఎవరైతే ఇళ్లకే పరిమితం అయ్యారో... కనీసం ప్రచారానికి కూడా రావడం లేదో అందరి గురించి కూడా తమకు ఆధారాలతో సహా చూపించాలి అని చెపుతున్నారు. కొంతమంది అయితే ఎన్నికలు అయిన తర్వాత ప్రగతి భవన్ కు కూడా రావాలని చెప్పినట్టుగా కూడా సమాచారం. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: