గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు కొంతమంది ప్రచారం చేయడానికి రెడీ అయిన సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల అంతగా కలిసి రావడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఇప్పుడు చాలావరకు ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రులు వచ్చినా సరే కనీసం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాలేక పోతున్నారని ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాకుండా ఇక్కడి నేతల మీద భారం వేశారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

దీనివలన పార్టీ నష్టపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుందని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని కాబట్టి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే పార్టీకి విజయావకాశాలు ఉంటాయని కొంతమంది నేతలు సూచనలు చేస్తున్నారు. అయినా సరే ప్రచారం చేయడానికి కొంత మంది ముందుకు రాకపోవడంతో ఇప్పుడు కార్యకర్తలలో ఆగ్రహం అనేది పెరిగిపోతుంది. క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి అంటే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

ఇక హైదరాబాద్ పరిధిలో కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తే పోటాపోటీగా పరిస్థితి ఉంటుందని కాబట్టి ఈ నాలుగు రోజులైనా సరే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరి ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి అంటే రెండు రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: