కరోనా  వైరస్ కారణంగా అన్ని దేశాలు అతలాకుతలం అయిపోయాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు కలిగిన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా అత్యధిక మరణాలు కలిగిన దేశంగా కూడా అమెరికా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. అయితే మొదట్లో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించిన అమెరికా ప్రభుత్వం ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అటు ప్రజల్లో కూడా కరోనా వైరస్ పై అవగాహన పెరిగి పోవడం... ప్రజలందరూ కరోనా వైరస్ ను ఒక సాధారణ ఫ్లూ లాగా భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దేశాల నుంచి అమెరికా పర్యటనకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.



 అదే సమయంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే కాదు వివిధ ట్రావెల్ ఏజెన్సీలు కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు పర్యాటకులు అందరిని  ఆకర్షిస్తూనే మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. ఈ క్రమంలో ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుపుకుంటున్న వ్యాక్సిన్ పర్యాటకులకు ఉచితంగా ఇచ్చేందుకు ప్రస్తుతం అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.



 అమెరికాలో పర్యటించాలని అనుకునే వారు తమ టూర్ ప్యాకేజీ తీసుకుంటే వారికి ఒక డోస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తాము అంటూ ఇటీవలే ఒక ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించడం ఆసక్తికరంగా మారిపోయింది. దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో దర్శనమ్ ఇవ్వవా అది కాస్త వైరల్ గా మారిపోయింది. ముంబాయి నుంచి న్యూయార్క్ కు కు ఒక లక్షా 74వేల 999 రూపాయలు ఉన్న ప్యాకేజీని తీసుకున్నవారికి వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తానంటూ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది. డిసెంబర్ 11వ తేదీన వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వారికి అందిస్తాము అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రకటన చూసిన నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: