ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గత కొన్ని నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే దాదాపుగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉన్న కరోనా వైరస్ కేసులను... ఆ తరువాత తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు శీతాకాలం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే కాదు శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుకుంటున్నాయి.  మరికొన్ని రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతున్న నేపథ్యంలో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది.



 ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ  ప్రసంగాలలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల వరుసగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ఆయా రాష్ట్రాలలో పంపిణీ చేసేందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రులకు సూచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవలే వ్యాక్సిన్  తొలి టీకా  ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా టీకా  మొదటి విడతలో భాగంగా 50 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వ్యాక్సిన్  దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉండడంతో ఈ ఏడాది లోపు పిల్లలకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని నిర్ణయించింది  ప్రభుత్వం. అంతేకాదు అందరికీ ఉచితంగా టీకా  ఇచ్చేందుకు నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: