రాను రాను రాజకీయరంగంలో చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలు చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపిస్తోంది... జాతీయస్థాయి పార్టీ అంటే ఆ లెక్క వేరే ఉంటుంది. జాతీయ స్థాయి పార్టీకి చెందిన కార్యకర్తల రూట్ సెపరేట్ గా ఉంటుంది. కానీ ఈసారి విషయం తారుమారైంది... మునుపెన్నడూ లేని విధంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒక మహా నగర స్థానిక ఎన్నికల కోసం ఆసక్తి చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం పలు పార్టీలు రోడ్ షో లు, సభలు ప్రచార కార్యక్రమాలు అంటూ తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే... ఇక అధికార పార్టీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలకు గట్టిపోటీ ఇచ్చేందుకు జాతీయ పార్టీ బిజెపి సైతం బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అధిక్యతను ప్రదర్శించటమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ వ్యవహారం కనిపిస్తోంది అన్న టాక్ రాజకీయ వర్గాల నుండి వినిపిస్తోంది. ఈ మాటకు మరింత  బలం చేకూరేలా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికల రేస్ లో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర ఉన్న వారి వివరాల్ని తెలిపింది సుపరిపాలన వేదిక. అభ్యర్థుల నామినేషన్ పత్రాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఆధారంగా వారు అసలు లెక్కలు తేల్చి వెల్లడించారు. నేర చరిత్ర కలిగిన మొత్తం అభ్యర్థులు 49 మంది కాగా... అందులో 17 మంది బీజేపీ అభ్యర్థులు కావడం పెద్ద షాకింగ్ న్యూస్.

ఈ పార్టీలోనే అత్యధికంగా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉండడం ఆశ్చర్యకరం. ఇక గ్రేటర్ రేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరువాత స్థానంలో నిలచింది. పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు ఉండగా.. మజ్లిస్ లో ఏడుగురు అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే... నేర చరిత్ర కలిగిన అభ్యర్థులలో ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉండడం ఆశ్చర్యకరమయిన  విషయం.
ఈ వివరాలు లెక్కలు పక్కనపెడితే.... జాతీయ పార్టీ అయిన బీజేపీ.. గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తి కనబరచడం రాజకీయ చరిత్రలో కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: