హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ మంత్రులు కదిలివస్తున్నారు.. ఇకపోతే బిజేపికి మాత్రం దేశంలోని కీలక నేతలను హైదరాబాద్ కు రప్పించి వారిచేత బీజేపి మున్ముందు చేయాలనుకున్న అభివృద్ది పనులను చెప్పేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి లోని పలు ప్రాంతాల్లో రోడ్ షో లు నిర్వహిస్తూ ప్రజల్లో టీఆరెఎస్ పార్టీపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు.




పటాన్‌చెరులోని జీఎమ్మార్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ ఉద్యోగులతో మంత్రి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రధాని మోదీ కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యోగులందరు సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల అమ్మకాలకు నిరసనగా సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపి పలు విషయాలను వెల్లడిస్తామని అన్నారు.



నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ బేషరతు మద్దతు ఇస్తుందని మంత్రి పేర్కోన్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లలోని మెట్టుకుమార్‌యాదవ్‌, పుష్పనాగేశ్‌, సింధు ఆదర్శ్‌రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, వారికుటుంబాలు, కాంట్రాక్టర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఓట్లు వేసి గెలిపించుకోవాలని మంత్రి కోరారు. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని విదేశాలకు అనుమతులు ఇస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం బీహేచ్‌ఈఎల్‌ సంస్థలకు రూ. 40వేల కోట్లు, యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌కు రూ. 30వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో కలిసి పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని హామీనిచ్చారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గొంతుగా ఉంటానని ఎంపీ హామినిచ్చారు.. ఈ కార్య క్రమంలో పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు..బీజేపీకి ఓటేస్తే హైదరాబాద్ భవిష్యత్ ను వదిలేసినట్లే అంటూ మంత్రి అన్నారు.. టీఆరెఎస్ జోరు చూస్తుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారేమో అంటూ సదరు అభిప్రాయ పడుతున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: