బీజేపీకి దూరదృష్టి ఎక్కువగాని తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో  ఎన్నికలు వచ్చినా దూరదృష్టితో ప్రణాళికలు వేసి ఎన్నికలలో ముందుకు సాగుతారు బిజెపి నాయకులు. అసమ్మతితో ఉన్న నాయకులను తమ పార్టీలో కలుపుకోవడం బిజెపికి వెన్నతో పెట్టిన విద్య. అయితే బీజేపీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది.

గ్రేటర్లో ప్రచారం కోసం బిజెపి అగ్ర నాయకులు రావడం యావత్  దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్‌లో దించి గ్రేటర్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో సామాన్య ప్రజలకు గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. బిజెపి గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ హైదరాబాదుకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది.

 దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపి నట్టు తెలుస్తుంది.తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న అగ్రనాయకత్వం... గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా మిషన్‌–2023కి గట్టి పునాది వేయాలనే ఆలోచనలో ఉంది. అందుకే ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు, మహిళా, యువమోర్చా నాయకులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. మరి గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీకి ఈ ఎన్నికలు ఇలాంటి ఫలితాలనిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. . 

మరింత సమాచారం తెలుసుకోండి: