గ్రేటర్ హైదరాబాద్ ఎనికల్లో ప్రతీ ఓటూ కీలకమే. ఎందుకంటే 150 డివిజన్లు ఉన్నాయి. చాలా పార్టీలు పోటీలో ఉన్నాయి. మెజారిటీలు వందల్లో కూడా రావచ్చు. ఒక్కోసారి పదులలో కూడా ఉండొచ్చు. ఈ మధ్యనే జరిగిన బీహార్ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సీట్లలో మెజారిటీలు వందల్లో వచ్చాయి. అంటే దీన్ని బట్టి గ్రేటర్ లో డివిజన్ల మధ్యన పోరులో  మెజారిటీల తేడా చాలా స్వల్పమని గ్ర‌హించాలి.

దాంతో ప్రతీ ఓటుని బంగారంలా, భద్రంగా చూసుకోవాలి. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇపుడు అదే పని చేస్తున్నాయి. అయితే మొత్తం 80 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో సెటిలర్స్ ఓట్లు 30 లక్షల దాకా ఉన్నాయి.మరి ఇవి నిజంగా బంగారమే. ఈ ఓట్లు కొల్లగొట్టే వారే గ్రేటర్ లో బహు మొనగాడు అవుతాడు అనడంలో సందేహం లేదు. ఈ ఓట్లలో అత్యధిక భాగం ఆంధ్రులవి, రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన వారంతా ఉపాధి, వ్యాపార రంగాల నిమిత్తం ఇక్కడ సెటిల్ అయ్యారు.

మరి వీరి మనసు చూరగొని ఓట్లు పొందే పార్టీ ఏదీ అన్నదే చూడాలి. ఆంధ్రా ఓటర్లు అనగానే మళ్ళీ కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు వచ్చెస్తాయి. అలాగే అభిమాన రాజకీయ పార్టీలు, నాయకుడు కూడా వచ్చేస్తారు. ఈసారి టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోంది కాబట్టి ఆ పార్టీ అభిమానుల ఓట్లు కొంతవరకూ అటు వైపు పడవచ్చు.

మరి వైసీపీ పోటీలో లేదు, కానీ పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా ఉన్నాయి. అవి ఎటు వెళ్తాయి అన్నది చూడాలి వైసీపీ ఈ ఎన్నికలను అసలు పట్టించుకోలేదు. దాంతో వైసీపీ అభిమానులు ఈ మధ్య దాకా టీయారెస్ కే ఓటు చేస్తూ వచ్చారు. మరి జగన్ తో కెసీయార్ కి చెడిందన్న వార్తల నేపధ్యంలో వారంతా ఏ వైపు వెళ్తారు అన్నది చూడాలి.

బీజేపీకి ఓటు చేద్దామంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు వైఎస్సార్ మీద చేసిన కామెంట్స్ తో వైసీపీ హర్ట్ అయింది. దాంతో ఆ ఓట్లు పడతాయా అన్నది డౌట్. అంతే కాదు జగన్ అంటే పడని పవన్ తో బీజేపీ దోస్తీ చేస్తోంది. అందువల్ల ఆ కోపం వల్ల కూడా వైఎస్సార్ అభిమానులు బీజేపీ వైపు రాకపోవచ్చు, మొత్తానికి చూసుకుంటే టీయారెస్ కి ఈ పరిణామాలు కలసివచ్చేలా ఉన్నాయని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: