గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బిజెపి అగ్రనేతలను రంగంలోకి దించుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలోకి వచ్చే కొంతమంది నేతలు విషయంలో ఇప్పుడు బీజేపీ నేతలు చాలా వరకు జాగ్రత్తగా ఉంటున్నారు. కొంతమంది నేతలు చూసీచూడనట్టుగా ప్రచారం చేస్తున్నారని దీనివల్ల పార్టీ అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచారం చేసే కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉంటున్నారు.

హైదరాబాద్ ప్రజల గురించి తెలియకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆరోపణలు బీజేపీ మీద ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కూడా వారికి కొన్ని సూచనలు చేస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు మాట్లాడొద్దని అనవసరంగా పార్టీ నష్టపోతుంది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో విజయం సాధించాలంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇబ్బంది పడతారు అని కొంతమంది కేంద్ర మంత్రులకు సూచనలు చేస్తుంది.

అయితే హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు అభివృద్ధి విషయం గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇతర అంశాల గురించి ఎక్కువగా మాట్లాడ వద్దు అని సూచన చేస్తున్నారు. మత విద్వేషాలు రగిల్చి ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ కీలక నేతలు కూడా ప్రచారం లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు చాలావరకు జాగ్రత్తగానే ప్రచారం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడానికి వారందరూ కూడా రెడీ అవుతున్నారు. మరి ఈ ప్రచారం బీజేపీని ఎంతవరకు పైకి తీసుకు వస్తుంది ఏంటి అనేది చూడాలి. అయితే పార్టీకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: