ఏపి ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి కోసం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. వాటితో పాటుగా ప్రజల అవసరాలను పరిశీలించేందుకు గ్రామ, సచివాలయ  వాలంటీర్ వ్యవస్థను అమలు లోకి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ వల్ల చాలా వరకు మేలు జరిగింది. అంతకన్నా ఎక్కువగా ప్రజలకు అన్యాయాలు కూడా జరిగాయి. వాలంటీర్ కదా అని ప్రజల పై రుబాబును ప్రదర్శించారు కొందరు ప్రబుద్ధులు.. ఈ విషయం ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సంభందిత అధికారులకు సూచించారు..



అయితే ఇప్పుడు మరో వాలంటీర్ జగన్ పేరుకు మాయని మచ్చను తీసుకొచ్చాడు.యువతి తో అసభ్యంగా ప్రవర్తించాడు..మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ రాత్రివేళ ఇంటికి వెళ్లి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. అడ్డుకోబోయిన ఆమె తల్లిని సైతం దారుణంగా కొట్టాడు. కేకలు విని ఆమె తండ్రి రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.యద్దనపూడి మండలం సూరారపల్లికి చెందిన టీనేజ్ యువతి మార్టూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమెపై కన్నేసిన గ్రామ వాలంటీర్‌ అక్కిశెట్టి రాజేష్ రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో యువతి ఇంటికెళ్లాడు.



ఇంట్లో వాళ్ల ఆధార్ కార్డులు, భూమి పాసు పుస్తకాలను  తీసుకురమ్మని చెప్పాడు. దాంతో తీసుకు రావడానికి ఇంట్లోకి వెళ్తున్న యువతిని బలవంతంగా లాగి అసభ్యంగా ప్రవర్తించాడు.ఆమె కేకలు విని బయటకు వచ్చిన యువతి తల్లిని సైతం చావ బాదారు..భార్యా , కూతురు కేకలు విని స్నానం చేస్తున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.ఈ మేరకు భాదితురాలు, ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మైనర్‌‌పై అత్యాచార యత్నం చేసిన వాలంటీర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు.. అయితే వాలంటీర్ ను కఠినంగా శిక్షించాలని, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ విషయం కాస్త టీడీపీ నేతల చెవిన పడటంతో రచ్చ కాస్త ఆద్యం పోసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: