గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటి అంటే కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ గురించి ఆసక్తికర చర్చలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నడుస్తున్నాయి. కొంతమంది నేతలు ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో బయటకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దాదాపు నలుగురు నేతలు హైదరాబాదులో పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది.

అందరూ కూడా బిజెపి లోకి వెళ్ళడానికి రెడీ అయ్యారని సమాచారం. త్వరలోనే బీజేపీ కండువా కప్పి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే దీనికి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది కీలక నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి గా ఉన్నారని సమాచారం.

వీరందరితో కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎప్పుడు పార్టీ మారతారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై రేపే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దానికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై వారు చాలా సీరియస్ గా ఉన్నారని అందుకే పార్టీ మారడానికి ఆసక్తి గా ఉన్నారని అంటున్నారు. మరి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి అంటే రెండు రోజులు ఆగాల్సిందే. ఎల్ రమణ చర్చలు జరుపుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: