కరోనా  వైరస్ కారణం గా నిలిచిపోయిన అన్ని రైలు సర్వీసులను క్రమ క్రమంగా పునరుద్ధరిస్తూ భారత రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందె. ఇటీవల దీపావళి దసరా పండుగ సందర్భం గా ఎంతో మంది సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అనే విషయం తెలిసిందే. దీంతో ఈ పండుగ సీజన్లో ఎంతోమంది మెరుగైన రైలు సర్వీసుల ను పొందారు. అయితే ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోనే రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ శుభ వార్త చెప్పింది.



 దసరా దీపావళి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు సర్వీసులను మరి కొంత కాలం పాటు కొనసాగించనున్నట్లు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న 14 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి అని చెప్పింది. ప్రత్యేక రైలు సమయాలు డిసెంబర్ ఒకటి నుంచి మార్చే అవకాశం ఉంది అని ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది ముఖ్యంగా అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం  మధ్య రెండు రైళ్లను నడపాలని ఇటీవల నిర్ణయించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అయ్యప్ప భక్తులందరికీ శుభ వార్త చెప్పింది.



 ప్రస్తుతం ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి-నిజామాబాద్‌-తిరుపతి (02793/02792), తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి (నం.02708/02707), హైదరాబాద్‌-విశాఖపట్నం-హైదరబాద్‌(02728/02727), హైదరాబాద్‌-న్యూ ఢిల్లీ-హైదరాబాద్‌ (02723/02724), సికింద్రాబాద్‌-విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (02784/02783), లింగంపల్లి-కాకినాడ టౌన్‌-లింగంపల్లి (నం02776/02775), హైదరాబాద్‌-ముంబై-హైదరాబాద్‌ (02702/02701), ఈ రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయి. డిసెంబరు 31 వరకు కాచిగూడ-బెంగళూర్‌-మైసూర్‌ రైలును కూడా పొడిగించారు. సికింద్రాబాద్‌-త్రివేండ్రం సెంట్రల్‌-సికింద్రాబాద్‌ (07230/07229) జనవరి 20 వరకు పొడగించనుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: