తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ పార్టీ పెద్ద బ్రేక్ వేసింది.. అవలీలగా గెలిచేస్తామని అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ మట్టి కరిపించి తమ బలం ఏంటో చూపించారు బీజేపీ పార్టీ నేతలు.. నిజానికి దుబ్బాక లో ఉన్న పరిస్థితులు వేరు అక్కడ టీ ఆర్ ఎస్ వైఫల్యం అనేకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి పై సింపతీ తోనే వారు గెలిచారు అని చెప్పొచ్చు..వరుసగా రెండు సార్లు ఓడిపోయినా రఘునందన్ రెడ్డి మూడో సారి కూడా పోటీ చేయడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యి పార్టీ ని గెలిపించేలా చేశాడని చెప్పొచ్చు..

ఇక గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. కేసీఆర్ వైహతంకంగా ఎన్నికలు నిర్వహించి బీజేపీ కి ఇబ్బంది తెచ్చారు. అనుకున్న దానికంటే సమయం తక్కువ గా ఉండడంతో బీజేపీ ఏర్పాలు సరిగ్గా చేసుకోలేకపోయింది. అంతేకాదు పార్టీ లో కుమ్ములాటలు కూడా ఇప్పుడు ఈ పార్టీ కి గెలుపు అవకాశాలను తక్కువ చేసింది.. ఇక బీజేపీ కేసీఆర్ వేసిన ఓ ఎత్తుగడ లో ఇరుక్కుంది అని చెప్పొచ్చు.. హిందూ భావజాలాన్ని నమ్మే బీజేపీ పార్టీ ని అదే రీతిలో కేసీఆర్ దెబ్బ కొట్టడం కొసమెరుపు..

హైదరాబాద్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ గణనీయంగా వుండడం, అదే సమయంలో ప్రశాంత వాతావరణం ఎక్కడ భగ్నమవుతుందో అన్న భయం హైదరాబాదీల్లో వుండడంతో, ఆ దిశగా తెరాస విమర్శలు చేస్తూ, భాజపాను టార్గెట్ చేయడం ప్రారంభించింది. నిజానికి దీన్ని తిప్పి కొడుతూ, తమపై అనవసరపు బురదవేస్తున్నారనే దిశగా భాజపా వెళ్లాల్సి వుంది. కానీ ఎందుకో, ఎక్కడో తేడా వచ్చింది.తెరాస అనుకున్న దిశగా భాజపా ప్రయాణం ప్రారంభించేసింది. పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రయిక్ అనే దారుణ పదజాలంతో కూడిన స్టేట్ మెంట్ ను భాజపా నేతలు వాడేసారు. ఇది నిజంగా సెల్ఫ్ గోల్ అనుకోవాలి. ఇలా అనడం ద్వారా హిందూ ఓటు గంపగుత్తగా తమకు వచ్చేస్తుంది అనుకోవడం భ్రమే. ఎందుకంటే హైదరాబాద్ జనాలు దశాబ్దాల కాలంగా ఫ్రశాంతంగా వున్నారు. ఇప్పుడు ఆ ప్రశాంతత భగ్నం అయిపోతుంది అంటే భరించలేదు. ఇలా కేసీఆర్ వేసిన వల లో బీజేపీ చిక్కుకుంది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: