గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేశ్, కవాడిగూడ టీఆర్ఎస్ అభ్యర్థి జి. లాస్యనందిత ఎన్నికల ప్రచారానికి అపూర్వస్పందన లభిస్తోంది. వీరిద్దరి ప్రచారం జోరుగా సాగుతోంది. లాస్యనందిత పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం కవాడిగూడ డివిజన్‌లోని లోయర్‌ట్యాంక్ బండ్, ఎల్బీగూడ, నేతస్పిన్నింగ్‌మిల్ క్వార్టర్స్, తాతానగర్, రజక కాలనీ, బండ మైసమ్మ నగర్ తదితర ప్రాంతాల్లో జి.లాస్యనందిత ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసి తనను

గెలిపించాలని ప్రజలను కోరారు. రెండోసారి తనకు అవకాశం కల్పిస్తే కవాడిగూడ డివిజన్‌ను నగరంలోనే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. నిరుపేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిషలు పాటు పడే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీనే అని ఆమె అన్నారు. కవాడిగూడ డివిజన్‌లోని మురికివాడలు, బస్తీలు, కాలనీల్లో రోడ్లు, జనాభాకు అనుగుణంగా మంచినీటి, డ్రైనేజీ పైప్ లైన్‌ను ఆధునికీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాటారం దినేష్, కల్వ గోపి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మనరేశ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం డివిజన్‌లోని జవహర్ నగర్, అశోక్ నగర్, బాపూ నగర్, వివేక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలే చెబుతున్నారని ఆమె తెలిపారు. వరదల సమయంలో ప్రజలను ఆదుకుంది.

టీఆర్ఎస్ ప్రభుత్వమే అని, అలాంటి పార్టీని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. మరోసారి అవకాశం ఇస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్త, శ్రీకాంత్, పరశురాం, గుండు జగదీశ్, గడ్డమీది శ్రీనివాస్, పీఎస్ శ్రీనివాస్, దినేశ్, ప్రేమ్, అశోక్, ఆకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: