హైదరాబాద్ నగరమంతా కమలం, గులాబీ రంగు జెండాలతో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.. గ్రేటర్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అన్న అంశం రోజు రోజుకు జనాల్లో ఆసక్తిగా మారుతుంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న బీజేపి ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.. అదే విధంగా అధికార పార్టీ అయిన టీఆరెఎస్ పార్టీ కూడా జోరుగా జనాలను చైతన్యం చేస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు.. కేటీఆర్ ఒకవైపు బీజేపి ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ , రాత్రి , పగలు నగరంలో ప్రచారాన్ని చేస్తున్నారు. 



ఇక మంత్రి హరీష్ రావు కూడా అదే దారిలో పయనిస్తున్నాడు.. రామచంద్రపురం, భారతి నగర్ మొదలగు ప్రాంతాలలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపి , తెరాస ప్రభుత్వానికి గల వ్యత్యాసాలను తెలుపుతూ వస్తున్నాడు. ముఖంగా అభివృద్ధిలో ఉన్న పథకాల గురించి ఈరోజు జరిగిన సమావేశంలో మాట్లాడారు..తామేదో గొప్ప చేశామని బీజేపీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 8 శాతంగా ఉన్న జీడీ పీ వృద్ధి.. ఇప్పుడు మైనస్‌ 24 శాతానికి పడిపోయింది. ఇంకా వీళ్లకు ఓటేస్తే అధోగతి తప్ప దు. అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి భరోసాగా నిలుద్దాం అంటూ అన్నారు. 



కేంద్ర ఆర్థికాభివృద్ధి ఏటికేడు దారుణంగా పడిపోతున్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జీడీపీ 15 నుంచి 16 శాతానికి పెరిగిందని తెలిపారు. జీఎస్టీలో కేంద్రానికి రూ.18 వేల కోట్లు అందించగా.. సెస్‌ రూపంలో రాష్ట్రం అతి తక్కువగా పొందిందన్నారు. ఇకపోతే మతాలను రెచ్చగొట్టి ఓట్లను పొందాలని బీజేపి మంత్రి కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికుల క్షేమం కోరే రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థలకు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి రూ.30 వేల కోట్ల ఆర్డర్‌ ఇచ్చిందని గుర్తుచేశారు.. మోదీ ఇస్తామని చెప్తూ ప్రజలను ఏమారుస్తున్నారని మండిపడ్డారు.. ఎన్ని అడ్డంకులు వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వానికి మళ్లీ అధికారాన్ని ఇవ్వాలని, అందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు..


మరింత సమాచారం తెలుసుకోండి: