ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. గెలుపు గుర్రాలను బరిలో దింపి.. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.‌ అధిష్ఠానం ఈ విధంగా ఎన్నికల రణతంత్రం రచిస్తూంటే ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మరో రూట్‌ ఎంచుకున్నారట.తమ అనుచరులను బీజేపీలోకి పంపించి.. తమ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనే బరిలో నిలిపారట ఇద్దరు ఎమ్మెల్యేలు.

కానీ.. ఈ విషయం టీఆర్‌ఎస్‌ పెద్దల వరకు చేరడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యే లను పిలిపించి ప్రశ్నించిందట అదిష్టానం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆశ్చర్యపోవడమే కాదు.. ఆగ్రహం వ్యక్తం చేశారట పార్టీ పెద్దలు.  పార్టీ పెద్దలు ఆరా తీసిన సమయంలో.. తమ అనుచరులు బీజేపీ నుంచి బరిలో దిగిన మాట వాస్తవమే అని అంగీకరించారట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతేకాకుండా వారు చెప్పిన సమాధానంకు ఆశ్చర్యపోయారట..

ఆ ఇద్దరు చెప్పిన సమాధానం ఏమిటంటే ఒకవేళ తమ అనుచరులు  బీజేపీ నుంచి గెలిస్తే.. వెంటనే టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారట. ఇలా చెప్పడం వల్ల పార్టీ పెద్దలు ఖుషీ అవుతారని లెక్కలు వేసుకున్నారు సదరు ఎమ్మెల్యేలు. కానీ.. వారికి ఊహించని షాక్‌ ఇచ్చారట పార్టీ పెద్దలు. పార్టీ  నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించకుండా.. అనుచరులను వేరే పార్టీ నుంచి పోటీ చేయించడం ఏంటని ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో ఆ ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినటైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: