కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో కొత్త పథకాన్నిలాంచ్ చేసింది. దేశంలోని రైతులు (ఏ రాష్ట్రానికి చెందిన వారైన పర్లేదు) ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో పడదు. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో చేరాలంటే రైతులకు కచ్చితంగా పొలంకు సంబంధించిన సమాచారం గల పాస్ బుక్ ఉండాలి. అదీ కూడా 5 ఎకరాలలోపు మాత్రమే పొలం ఉండాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే ఈజీగానే ఈ పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరొచ్చు. పైన తెలిపిన అర్హతలు ఉన్న రైతులు అందరూ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే సులభంగానే పథకంలో చేరొచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఫార్మర్స కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి స్కీమ్‌లో చేరొచ్చు.

ఇక ఇప్పుడు మరలా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం లో భాగంగానే ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2,000 అందించడానికి రెడీ అవుతోంది. ఈసారి రైతులకు మోదీ సర్కార్ ఏడో విడత కింద రూ.2 వేలు అందిస్తోంది. ఈ డబ్బులు డిసెంబర్ 1 నుంచి నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి. ఈరోజు కాకుండా మరో ఐదు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి ఆ పీఎం కిసాన్ డబ్బులు వచ్చి చేరతాయి.


ఇక రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే దగ్గరిలోని అగ్రికల్చర్ ఆఫీసర్‌ను కలవండి. ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.

PM Kisan Toll Free Number: 18001155266PM Kisan Helpline Number: 155261PM Kisan Landline Numbers: 011-23381092, 23382401PM Kisan's new helpline: 011-24300606PM Kisan helpline: 0120-6025109

మరింత సమాచారం తెలుసుకోండి: