తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్లుండు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై చాలావరకు కూడా ఆసక్తి ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఎలాంటి విమర్శలు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎలాంటి అంశాలను ఇప్పుడు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా ప్రజల్లో ఆసక్తి అనేది ఉంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు అంటే రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటాయి.

కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ పర్యటన విషయంలో అదే విధంగా బహిరంగ సభ విషయంలో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి ఇప్పుడు పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కొంత మంది బీజేపీ నేతలకు కండువాలు కప్పి ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొంతమంది నేతలు పార్టీలోకి రావడానికి రెడీ అయ్యారని సమాచారం. మరి ఆయన సమక్షంలో పార్టీ మారతారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

అయితే ఇప్పటికీ నలుగురు నేతలు పార్టీ మారడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలకు గాలం వేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం ఆయన బహిరంగ సభ మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రచారం చేసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. మరి సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఎలా ఉంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: