తెలంగాణలో రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి గత కొంతకాలంగా ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా ఆయన పార్టీ మారడం ఖాయం అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా కనపడటం లేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

 రేవంత్ రెడ్డి కు భారతీయ జనతా పార్టీలో కొంత మంది నేతలతో మంచి స్నేహం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గరికపాటి మోహన్ రావుతో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మంచి స్నేహం ఉంది. కాబట్టి ఆయనతో ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే పార్టీ మారే అంశానికి సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. గరికపాటి మోహన్ రావు ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఫోన్ కూడా చేసి బీజేపీ లోకి రావాలని చెప్పారు అని ఆయనతో పాటుగా కడియం శ్రీహరి కూడా ఇప్పుడు గరికపాటి మోహన్ రావు ఆహ్వానించారని అంటున్నారు.

దీనికి ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా మారాయి. గరికపాటి మోహన్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి సహా కొంతమంది నేతలతో ఎక్కువగా సావాసం చేశారు. కాబట్టి వీరందరూ కూడా ఇప్పుడు పార్టీ మారే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చూడాలి మరి రేవంత్ పార్టీ మారే అవకాశం ఉందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: