ప్రతీ దానికీ ఒక టైం ఉంటుంది. మన చేతిలో కొన్ని ఉన్నప్పుడు దాని ప్రకారం డ్రైవ్ చేసుకుంటూ పోతే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అయితే కొన్ని సార్లు సమీకరణలు తప్పి అంచనాలు కూడా తేడా  కొట్టేయ‌వచ్చు. అపుడు మిస్ ఫైర్ అవుతుంది కూడా. ఇక ముందస్తు ఎన్నికలు దేశంలో ఎవరికీ అచ్చి రాని వేళ 2018 చివరలో కేసీయార్ అసెంబ్లీకి ముందస్తు పెట్టి మరీ సక్సెస్ కొట్టారు.

ఇపుడు ఆయన గ్రేటర్ ఎన్నికలను మూడు నెలల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇది రైట్ టైమేనా అన్న డౌట్లు టీయారెస్ లోనే వస్తున్నాయట. ఎందుకంటే దుబ్బాక రిజల్ట్ వచ్చి గట్టిగా ఇరవై రోజులు కూడా కాకుండానే గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ తీర్పు చేప్పే సీన్ వచ్చేసింది. అంతే కాదు, కొద్ది నెలల క్రితం భారీ వరదలు హైదరాబాద్ ని ముంచెత్తాయి. ఆ ప్రభావం అలా ఉండగానే ఇపుడు ఎన్నికలు అంటూ ఓటరు  చేతికి కత్తి ఇచ్చేసిన ఘనత టీయారెస్ దే అంటున్నారు.

ఓ వైపు టీయారెస్ లో ఇంకా సర్దుకోవాల్సింది చాలా ఉంది. అదే టైంలో నిరాశ కూడా ఉంది. దుబ్బాక ఫలితం దెబ్బ కొట్టాక శ్రేణులు ఒక్కసారి డిఫెన్స్ లో పడ్డాయి. అందరినీ సమాయత్తం చేసి రంగంలోకి దిగిగే కధ వేరేలా ఉండేది అన్న భావన కూడా ఉంది. మరో వైపు బీజేపీ సమరోత్సాహం కూడా అలాగే ఉంది. వారిని అలా దుబ్బాక టూ గ్రేటర్ అంటూ ఈ వైపుగా తేవడం ద్వారా ప్రత్యర్ధికి మేలు చేస్తున్నారా అనిపించేలా సీన్ ఉందిపుడు.

అందుకే పదే పదే అధికార పార్టీకి ప్రజాదరణ లేదు, వ్యతిరేకత నిండుగా ఉంది అని బీజేపీ కామెంట్స్ చేస్తోంది. అదే టైం లో వరదలను కూడా ప్రస్తావించి హైదరాబాద్ రోడ్ల మీద కార్లు తిరగాలా బోట్లు తిరగాలా అంటూ సెటైరికల్ గా బీజేపీ పెద్దలు సంధిస్తున్న ప్రశ్నలు టీయారెస్ కి ఇరకాటమే. మొత్తానికి ఏదోలా గెలిచాం అనిపించుకుందామనుకుంటే ఏమో కానీ లేకపోతే మాత్రం గ్రేటర్ ఎన్నికలకు  ఇది రాంగ్ టైం టీయారెస్ కి అన్న విశ్లేషణలు అయితే  గట్టిగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: