భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా రాజస్థాన్ నుంచి కీలక నేతలు కొంతమంది అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా కొంత మంది వస్తున్నారు అనే విషయం తెలిసిందే. అయితే వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రచారం చేయడానికి జనసమీకరణ అనేది ఇప్పుడు బాగా ఇబ్బందికరంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టిఆర్ఎస్ పార్టీ జన సమీకరణ విషయంలో ముందు ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ మాత్రం జన సమీకరణ విషయంలో వెనుకబడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేసినా చాలామంది స్థానిక నాయకులు కనీసం ప్రచారం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కార్యకర్తలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొంతమంది మీద ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ఆగ్రహంగా  ఉంది. జన సమీకరణ విషయంలో కూడా వారి నుంచి సహకారం అందడం లేదని దీంతో ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రచారం చేసే విషయంలో జనసమీకరణ లేకపోతే గనుక మీడియాలో  నెగటివ్ గా హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జనసమీకరణ అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. తమకు మద్దతు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసుకోలేక పోతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: