ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న కొన్ని పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది అనే స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి ఇప్పుడు పార్టీ నేతలను కూడా బాగా ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అలా ముందుకు అడుగులు వేసే విషయంలో వివాదాలు ఎక్కువగా తెచ్చుకుంటున్నారు అనే భావన ఉంది.

పార్టీలో ఇటీవల ప్రకటించిన పదవుల్లో ఎక్కువగా సీనియర్ నేతలకు ఇచ్చారు. అంతమంది యువనేతలు ఉన్నా సరే వారికి పదవులు ఇచ్చే విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపించలేదు. దీనివలన పార్టీ నష్టపోతుందని భావన చాలామందిలో వ్యక్తమవుతుంది. పార్టీ కోసం పని చేసే యువ నేతలను చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా గుర్తించే ప్రయత్నం చేయకుండా ఉంటారు. తన పక్కనే ఉన్న సీనియర్ నేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం చూస్తూనే ఉంటాం. పార్టీ ఎక్కువగా నష్టపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరుతో చిరాకుగా ఉన్న రాయలసీమ నేతలు కొంతమంది పార్టీ మారడానికి ఆసక్తి గా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానాని కి కూడా వారు సమాచారం ఇచ్చారని త్వరలోనే జేసీ ఫ్యామిలీ  పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. జేసీ ఫ్యామిలీ బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి దీనికి సంబంధించి బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపారని సమాచారం. రాజకీయంగా ఇప్పుడు ఆయన వైసీపీలో వెళ్లే అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎలాంటి సహకారం లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ లోకి వెళితే కొంతమంది నుంచి సహకారం అందుతుంది అని ఆయన భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: