తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల చివరి రెండు రోజుల్లో ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని పరిణామాలు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి. ఆయన ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇపుడు చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడుతుంది.

కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ప్రచారం చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావన రాష్ట్రస్థాయి నేతల్లో ఉంది. అయితే కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు కాస్త ఎక్కువగానే పట్టుదలగా ఉన్నా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రచారం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. అటు క్యాడర్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఇబ్బందుల్లో పడుతుంది. మీడియా సహకారం కూడా లేకపోవడంతో ప్రచారం విషయంలో ఘోరంగా వెనుకబడి ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే స్థానంలో ఆయన ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రచారం చేయడానికి ఆయన వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. దాదాపుగా 47 డివిజన్ల లో టీడీపీ బలంగా ఉంది. వీటిల్లో ఎక్కువగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రచారం చేసే విషయంలో కాస్త సీరియస్ గానే ముందు అడుగులు వేసే అవకాశం ఉందని అంటున్నారు. బాలకృష్ణ కూడా ప్రచారానికి అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: