గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎలా అయినాసరే సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎలాగైనా సరే ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అయితే ఆయనకు కొంతమంది నేతలు నుంచి సహాయ సహకారాలు అందటం లేదు. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు చాలామంది ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు.

దీని వలన రేవంత్ రెడ్డి నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రచారం విషయంలో కాస్త సీరియస్గా ఉన్నారు. అయినా సరే రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఆయనకు సహాయ సహకారాలు అందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతోంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

నియోజకవర్గం మీద మంత్రులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రతి డివిజన్ లో కూడా ఎక్కువగా ఫోకస్ చేసారు. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. రేవంత్ రెడ్డి మాత్రం కొంతమంది నాయకుల మీద ఇప్పటికే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రచారం చేయని నేతల మీద ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేశారని దీనివల్ల ఇప్పుడు రాజకీయంగా కొన్ని పరిణామాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నేతలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందరి జాబితా కూడా ఇప్పుడు ఆయన అధిష్టానానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: