ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తమిళనాడులో నివర్ తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వరదల దెబ్బ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఆందోళన ఉంది. రైతులు చాలా మంది నష్టపోయారు. చిన్న చిన్న రైతులు, వ్యాపారులు చాలా మంది నష్టపోయారు.  దక్షిణ భారత దేశంలో మూడు రాష్ట్రాలు  బాగా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో రాష్ట్రాల సిఎంలు కూడా చాలా వరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘నివర్’ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి అని ఆయన కోరారు. దక్షిణ కోస్తా, సీమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని ఆయన డిమాండ్ చేసారు. 24 గంటల్లో మరింత తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు. తీవ్ర గాలులకు భారీ చెట్లు నేలకూలాయి అని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అని ఆయన చెప్పుకొచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలి అని ఆయన కోరారు. ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని ఆయన వివరించారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలి అన్నారు. వర్షాల విషయంలో ప్రభుత్వ సన్నాహాలు ప్రజల్ని భయపెడుతున్నాయి అని ఆయన విమర్శించారు. రియల్ టైం గవర్నెన్స్ తో సహాయక చర్యలను పర్యవేక్షించాలి అని వ్యాఖ్యలు చేసారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేసారు. రైతులను హెచ్చరించి ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనకుండా చూడాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: