ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారిపై పోరాడుతూ బిజీగా ఉన్న ప్రపంచానికి యూనిసెఫ్ మరో షాక్ ఇచ్చింది. చాపకింద నీరులా హెచ్‌ఐవీ-ఎయిడ్స్ పెరుగుతోందని హెచ్చరించింది. చిన్నారులు, గర్భవతులు, యువత హెచ్‌ఐవీ పోరాటంలో వెనుకబడ్డారని, అందువల్ల ప్రపంచంలోని అనేక దేశాల్లో హెచ్‌ఐవీ మరణాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ప్రతి 5 నిముషాలకు
ముగ్గురు చిన్నారుల చొప్పున హెచ్‌ఐవీ బారిన పడుతున్నారని సంచనల విషయాలు వెల్లడించింది. దీనికి సంబంధించి తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.

గతేడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2.8 మిలియన్ల మంది పిల్లలు హెచ్ఐవీ బారిన పడ్డారని, దాదాపు 1,10,000 మంది పిల్లలు ఆ మహమ్మారి కారణంగానే మరణించారని తన నివేదికలో యునిసెఫ్ పేర్కొంది. హెచ్ఐవీ, ఎయిడ్స్‌కు
వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్న పిల్లల్లో యాంటీ రెట్రోవైరల్  చికిత్స కవరేజ్ తక్కువగా ఉందని తెలిపింది.


యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు హెచ్ఐవీ మహమ్మారి బారిని పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా 0 నుంచి 9 సంవత్సరాల వయసు గల 1,50,000 మంది పిల్లలకు,10 నుంచి
19 సంవత్సరాల వయసుగల 1,70,000 మందికి  కొత్తగా హెచ్ఐవీ సోకిందని వెల్లడించారు. అయితే యువతతో పోల్చితే పిల్లలే ఎక్కువగా ఎయిడ్స్ వల్ల మరణిస్తున్నారని వివరించారు. తమ బిడ్డలకు హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి
చెందకుండా నిరోధించడానికి తల్లులకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ పెంచాలని సూచించారు.


హెచ్ఐవీతో బాధపడుతున్న 1.3 మిలియన్ల మంది మహిళలు బిడ్డలకు తమ పాలు ఇవ్వడం వల్లనే హెచ్ఐవీ సోకిందని అంచనాకు వచ్చారు. ఆరోగ్య సేవలు మెరుగుపర్చడం ద్వారా హెచ్ఐవీని అదుపు చేయాలని యునిసెఫ్ ప్రపంచ దేశాలకు సూచించింది.
రానున్న రోజుల్లో కూడా ఇలానే కొనసాగితే ప్రపంచం మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవలసి రావచ్చని, అందువల్ల ముందుగానే మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: