తెలంగాణ గాంధీ గా పేరున్న కేసీఆర్ తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. అప్పటినుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి.. మతకల్లోలాలు చెలరేగడంతో కేసీఆర్ సక్సెసయ్యాడని చెప్పొచ్చు.. కేసీఆర్ సీఎం అయినా దగ్గరినుంచి హైదరాబాద్ లో అల్లర్లు, కర్ఫ్యూలు చాలా తక్కువగా ఉన్నాయి.. అయితే దీన్నే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు కేసీఆర్.. బీజేపీ లాంటి పార్టీ ని నిలువరించాలంటే ఇలాంటి రాజకీయం చేయాలనీ కేసీఆర్ అనుసరిస్తున్నారు.మొన్నటి మేనిఫెస్టో లో కేసీఆర్ దీన్ని నొక్కి వక్కాణించడం ఇప్పుడు ఆసక్తికరంగానూ వివాదంగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి మత అల్లర్లు చెలరేగలేదు, మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు కావడంలో తమ ప్రభుత్వం మంచి కృషి చేసిందని ఇన్ డైరెక్ట్ గా మైనార్టీలను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. బీజేపీ కూడా మైనార్టీలకు పూర్తి గా వ్యతిరేకమైన పార్టీ అని మొదటినుంచి పేరుంది అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంది.. పాత బస్తి పై సర్జికల్ స్ట్రైక్స్ అని పెద్ద ఎత్తున వివాదం నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది.. దీన్ని కేసీఆర్ తన అస్త్రంగా మలుచుకోబోతున్నాడు.

అయితే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు ఊరికే చేయలేదని తెలుస్తుంది..తెలంగాణలో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పీఆర్ టీం ద్వారా.. వీటిని మీడియాలో విస్తృతంగా కవర్ అయ్యేలా చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న ఓ రకమైన ఉద్వేగ పరిస్థితుల నడుమ కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపడం సహజమే. దీనిపై అందరూ రకరకాలుగా విశ్లేషించుకుటున్నారు. టీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీ నేతలు కుట్రలు పన్నారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టి.. రాజకీయంగా లాభపడే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఖచ్చితమైన ఇంటిలిజెన్స్ సమాచారం ఉండబట్టే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  మరి గ్రేటర్ ఎన్నికలు అయ్యేంతవరకు ఎప్పుడు ఏం జరుగుతుందో క్లియర్ గా తెలియని నేపథ్యంలో అందరు అప్రమత్తంగా ఉంటే బెటర్..

మరింత సమాచారం తెలుసుకోండి: