తెలంగాణలో మత విద్వేషాలు, శాంతిభద్రతలు విఘాతం ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం గానే ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు. రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతోందని కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచన చేశారు.

ఇప్పుడు పోలీసులు కూడా కొంతమంది నేతలు విషయంలో చాలా వరకు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి ఎంపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ పోలీసులు నోటీసు ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇటీవల ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా అక్బరుద్దీన్ ఒవైసీ కూడా సమాధులు విషయంలో కాస్త ఎక్కువగానే విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ లో ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా తెలంగాణ పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.

మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఇదే గనుక కొనసాగితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తాము భవిష్యత్తులో ఎలా ఉంటాము అనే ప్రశ్నలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయని కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త ఘాటుగానే స్పందించారు. మరి భవిష్యత్తులో ఆయన తీసుకునే చర్యలు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: