గ్రేటర్ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో భాగ్యనగరంలో ఎన్నికల ప్రచారాల జోరు రోజు రోజు కి వేడెక్కిపోతున్నాయి.. అన్ని పార్టీ లు తమదైన అస్త్రాలతో, మేనిఫెస్టో లతో ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు సాగిపోతున్నాయి.. అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కూడా గ్రేటర్ లో మేనిఫెస్ట్ ను రిలీజ్ చేసి ప్రజల్లోకి దూసుకెళ్ళేవిధముగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఫలితం వారిని కొంత వెనక్కి, బీజేపీ ని కొంత ముందుగా నిలబెట్టింది చెప్పచు..నిజానికి దుబ్బాక లో బీజేపీ విజయం చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయ్యింది..

 తెలంగాణ లోప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లో పస లేని వేళా, అధికార పార్టీ కి ఎదురెళ్లి నిలిచే పార్టీ లేని వేళా, ప్రజలు టీ ఆర్ ఎస్ కి కాకుండా ఎవరికీ ఓటు వేయాలి అని సందిగ్ధం నెల కొన్న వేళా, బీజేపీ పార్టీ గెలుపు వీటన్నికి సమాధానం గా నిలిచింది.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోకూడా బీజేపీ ఏమాత్రం కౌంటర్ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది.కానీ ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ నాలుగు సీట్లు గెలవడంతో ప్రజల్లో అప్పుడప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ పై నమ్మకాలూ పెట్టుకున్నారు. డీనికి తోడు కేసీఆర్ పై వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపుకి కారణమయ్యింది.

అయితే ఇదే ఉత్సాహంతో గ్రేటర్ లోనూ గెలవాలని చూస్తుంది బీజేపీ పార్టీ.. కేసీఆర్ ని విమర్శించి అయన ప్రవేశ పెట్టిన పథకాలను తమవే అని చెప్పుకుంటూ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటిని తిప్పికొట్టాలంటే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడమే మేలని అభిప్రాయపడ్డారు.. అయితే ఆ సభ జరిగేలా లేదని తెలుస్తుంది. దుబ్బాక ఉపఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రచారసభ ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన చేయలేదు. చివరికి అక్కడ వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రచారసభ నిర్వహించిటనట్లయితే.. దుబ్బాకలో ఫలితం ఖచ్చితంగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చి ఉండేదని నమ్ముతున్నారు. హోరాహోరీగా ఉన్న గ్రేటర్‌లో అలాంటి తప్పిదం చేయకూడదని.. కేసీఆర్ ప్రచారం చేయాల్సిందేనని కోరుతున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సభ ఉండడం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: